%1$s

వెన్నునొప్పికి అత్యాధునిక మరియు సురక్షితమైన పుల్‌ ఎండోస్కోపిక్‌ శస్త చికిత్సలు

advanced endoscopic spine surgery back pain

వెన్నముక ప్రాధానత్య

మనిషిని నిలువుగా నిలిపి ఉంచేదీ ఆత్మవిశ్వాసావికీ, ఆరోగ్యానికీ ప్రతీకగా నిలిచేదే వెన్నెముక ఇది తనంతట తానే నడిదే (అటానమస్‌) నాడీమండల భాగం. ఇది చాలా కీలకమైనదే కాకుండా అత్యంత నున్నితమైనది కూడా. దృఢమైన వెన్నువూసలతో నిర్మితమైన ఈ ప్రధాన నాడీ వ్యవస్థకు సంబంధించిన సమన్యలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన బాధకు దారితీస్తాయి. ఈ సమన్యల పరిష్కారం కోనం కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు అనివార్యం.వెన్నుకు చేసేశస్త్రచికిత్సలు సాధారణంగా ఓపెన్‌ సర్జరీలుగానే ఉంటూ వచ్చాయి. ఇలాంటి సర్జరీల్లో ఆవరీషన్‌ చేయాల్సిన ప్రాంతంలో సర్జన్‌ పెద్ద గాటు పెట్టి తెరచి చూస్తూ శస్త్రచికిత్స చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఈ రంగంలో వచ్చిన పురోగతితో వెన్ను మెడ ప్రాంతాల్లో అతి చిన్న గాటుతో ఎండ్‌ డోస్కోపిక్‌ విధానంలో శస్త్రచికిత్స చేస్తున్నారు.పుల్‌ ఎండోస్కోపిక్‌ స్పెన్‌ సర్జరీలనే వీటిలో ఆసరేషన్‌ కోసం పెద్దగా కోత పేట్టాల్సిన ఆవసరం లేకపోవడం వల్ల వెన్ను చుట్టూరా ఉండే కండరాలకు నష్టం జరగకుండా చూడటం సాధ్యమవుతోంది.

ఆధునిక మరియు సాంప్రదాయ స్పైన్ సర్జరీల వ్యతాసం ఏమిటి

సంప్రదాయ ఓపెన్‌ సర్జరీలో డాక్టర్లు 5 నుంచి 6 అంగుళాల మేర గాటు పెడతారు, వెన్నును చూడటానికి కండరాలను పక్కకు జరుపుతారు. అప్పుడు మాత్రమే వెన్నునొప్పికి కారణమైన భాగాన్ని సర్జన్స్ చూడగలుగుతారు. వ్యాధిసోకిన, దెబ్బతిన్నఎముకలను, వెన్నుపూసల మధ్య డీస్కులను తొలగించగలుగుతారు. సర్జరీ చేసిన ప్రాంతంలో శరీర అంతర్భాగాలను స్పష్టంగా చూసి స్క్రూలను, అవరసరమైన వాటిని పెట్టి వెన్నుపూనలను స్థిరీకరించి తద్వారా రోగి కోలుకోనేట్లు చేయగలుగుతారు. ఈ ఓపెన్‌ సర్జరీ కారణంగా తలెత్తే పెద్ద దుష్ప్రభావం ఏమిటంటే కండరాలను పక్కకు లాగడం వల్ల వాటితో పొటు వాటికి అతికి ఉన్న మృదువైన జాలం కూడా దెబ్బతింటుంది. సర్జన్ పనికి అవసరమైన దానికంటే ఎక్కువ విస్తీరణంలో కణజాలం వ్రభావితమవుతుంది. దానివల్ల శరీర కండర కణజాలానికి తీవ్రమైన నష్టం జరుగుతుంటుంది. సర్జరీకి పూర్వం ఉన్నదానికంటే భిన్నమైన నొప్పీ బాధ వంటివి పేషెంట్ల అనుభవంలోకి వస్తాయి, వారు కోలుకోడానికీ ఎక్కువ సమయం వడుతుంది.

ఆధునిక సర్జరీల వల్ల వెన్నుకూ, కండరాలతో సహా వెన్ను నిర్మాణానికి జరిగే నష్టాన్ని వీలైనంత కనీన స్థాయికి తగ్గించే విధంగా ‘ఫుల్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్ సర్జరీలను రూపొందించారు. వెన్నులో సమస్యకు కారణమౌతున్న భాగాన్ని సర్గన్‌కు స్పష్టంగా చూపేందుకు వీలవుతుంది. చిన్నగాటు, ఆత తక్కువ రక్తనష్టం కావడం, వేగంగా కోలుకోగలగడం వంటి ప్రయోజనాలుంటాయి. సాంప్రదాయ వెన్ను శస్త్ర చికిత్సలతో పోలిస్తే కొన్ని ప్రత్యేక కేసులలో మినహాయించి ఇప్పుడీ తక్కువగాటుతోనే సాధ్యమయ్యే ‘మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్ సర్జరీలతో చాలా తక్కువ సమయంలోనే ఆపరేషన్ పూర్తవుతుంది

పుల్‌ ఎండోస్కోపిక్‌ సర్జరీ ఎప్పుడు? ఎలా చేస్తారు?

ఇది సురక్షితమైన అత్యాధునిక శస్త చికిత్స. సాధారణ మందులు, ఫిజియోథెరపీ వంటి సర్జరీయేత పద్ధతుల ద్వారా వెన్నునొప్పిని తగ్గించడం సాధ్యం కానప్పుడు ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జరీ చేస్తారు. దీనికి తోడు వెన్నునొప్పికి కారణమవుతున్న వెన్ను భాగాన్ని స్పష్టంగా ఖచ్చితంగా గుర్తించినపుడు మాత్రమే దీనిని ఎంచుకోవాలి. వెన్నుకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ విధానంలో అనేక ఆధునిక నిర్ధారిత ప్రొసిజర్స్ వాడుతున్నారు. డీకంప్రెషన్‌, స్పైనల్‌ ప్యూజన్‌ వంటి ప్రొసీజర్లను దీనికి ఉపయోగిస్తారు. ఎముక హెరినేటెడ్‌ డిస్క్‌ వల్ల నాడులపై ఏర్పడే ఒత్తిడిని డీకంప్రెషన్‌ ద్వారా తొలగిస్తారు. వెన్నులో చిన్నఎముకల మూలంగా ఏర్పడే సమస్యలను స్పైనల్‌ ఫ్యూజన్‌ విధానంతో పరిష్కరిస్తారు.

ఫ్యూజన్‌, డీకంప్రెషన్‌ వంటి ప్రొసీజర్లను పుల్‌ ఎండోస్కోపిక్‌ సర్జరీ పద్ధతిలో చేయటానికి స్పైన్‌ ఎండోస్కోపిక్‌ పరికరాన్ని వాడతారు.ప్రొసీజర్ నిర్వహించాల్సిన ప్రదేశంలో 6- 8 మిల్లి మీటర్ల అతి చిన్న గాటు పెడతారు. అక్కడి నుంచి చర్మం, మృదు కణజాలం గుండా వెన్నును చేరేదాకా ఈ పరికరాన్నిలోపలకి ప్రవేశపెడతారు. దీంతో వెన్నులోని సమస్యాత్మక ప్రదేశం వద్ద ఓ సన్నని కనెక్షన్‌ తయారవుతుంది. ఇది ప్రొసీజర్‌ పూర్తయ్యే వరకూ శస్త్రచికిత్స జరిగే
ప్రాంతంలోని కండరాలను పక్కకు జరిపి ఉంచుతుంది.

వెన్ను నుంచి తొలగించాల్సిన ఎముక భాగాలు ఓ గొట్టం లాంటి సన్నని కనెక్షన్‌ ద్వారా బయటకు వస్తాయి. ఫ్యూజన్‌ ప్రొసీజర్‌లో వాడే స్కూలు, రాడ్లను కూడా దీని ద్వారానే లోపలికి తీసుకేళతారు. ప్రొసీజర్‌, శస్త్రచికిత్స అనంతరం ఎండోస్కోప్‌ను తొలగిస్తారు. దీంతో కండరాలు మళ్లీ తమ స్ధానానికి జరుగుతాయి. ఇది కండరాలకు జరిగే నష్టాన్ని కనీస స్థాయికి పరిమితం చేస్తుంది. సంప్రదాయ ఓపెన్‌ సర్జరీతో పోలిస్తే ఈ కండరాల నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఓపెన్‌ స్పైన్‌ సర్జరీలో జనరల్‌ అనస్తీషియా ఇస్తారు. అందువల్ల ఇది పూర్తయే వరకూ పేషెంట్‌ నిద్రలోనే ఉంటారు. ఎండోస్కోపి ప్రొసీజర్లో రీజినల్‌ అనస్థీషియా ఇవ్వటం వల్ల పేషంట్‌ సృహ లోనే ఉంటాడు. ఈ పద్ధతి 2-3 రోజుల్లో పూర్తవుతుంది.కాబట్టి ఆపరేషన్‌ తర్వాత పేషెం పేషెంట్‌ ఇంటికి చేరుకోవచ్చు.ఈ పద్దతిలో కండరాలను చాలా తక్కువగా కదిలించడం వల్ల నోప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. వ్రస్తుతం ఆత్యాధునికమైన పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులు అందుబాటులోకి వచ్చినందున శస్తవికిత్స వల్ల కలిగే ఆ కొద్దిపాటి నొప్పిని కూడా తగ్గించేందుకు వీలుంది.

చికిత్స త్వరవాత తీసుకోవసిన జాగ్రత్తలు ఏమిటి ?

ప్యూజన్‌ ప్రొసీజర్‌ చేయించుకున్న తర్వాత ఎముక గట్టి పడేందుకు కొని నెలల సమయం పడుతుంది. కానీ ఈ లోపే నొప్పి నుంచి విముక్తి కలిగి పరిస్థతి మెరుగుపడుతుంది. కోలుకునే సమయంలో ‘పేషెంట్‌ కదలికలు ఏవిధంగా ఉండాలి? కూర్చోవటం.. నిలబడటం.. నడవటంలో పాటించాల్సిన జాగ్రత్తలను డాక్టర్‌ సూచనల ప్రకారం వాటిని తప్పకుండా పాటించాలి. ఒక వ్యక్తి ఎంత వేగంగా సాధారణ ఆరోగ్య పరిస్థతికి చేరుకోగలరు అన్నది చేయించుకున్న ప్రాసీజర్‌, శస్త్రచికిత్స తీవ్రత, ఆ వ్యక్తి సాధారణ ఆరోగ్య స్టితిపై ఆధారపడి ఉంటుంది.శస్త్రచికిత్స, ఫ్రాసీజర్‌ తర్వాత కోలుకొని తిరిగి బలం పుంజుకునేందుకు డాక్టర్‌ ఫిజియోథెరపీ సూచించే అవకాశం ఉంటుంది. 

సంప్రదాయ శస్త్రచికిత్స చేయించుకున్న వారితో పోలిస్తే పుల్‌ ఎండోస్కోపిక్‌ వద్ధతిన సర్థరీ చేయించు కున్నవారు త్వరగా పిజియోతేరపీని చేపట్టేందుకు, ఇబ్బంది లేకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టీ మీకు ఒకవేళ శస్త్రచికిత్స తప్పనిసరైతే మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా పుల్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జరీతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567